MBNR: రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. HYD నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో పాటు ఇతర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి మ్యాపింగ్ పూర్తి చేయాలని, పెండింగ్లో ఉన్న ఫారం 6,7,8 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.