శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. మార్చి 6న రిలీజైన ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ OTT వేదిక ఈటీవీ విన్లో మార్చి 22 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా… అలీ, ధన్రాజ్, ప్రిన్స్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.