TG: మూసీ రివర్ ఫ్రంట్ మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్‌కు చెందిన సంస్థ రూపొందించింది. ప్రధానంగా ఆరు ప్రధాన అంశాలుగా ప్రణాళికను తీసుకొచ్చింది. నదిపై వంతెనలు, రోడ్లు, ట్రంపెట్‌లతో పాటు నగరాన్ని, ఓఆర్ఆర్ను అనుసంధానించేలా ఎలివేటెడ్ కారిడార్లు, ప్రజలకు అనువైన రవాణా సౌకర్యాలు, రెస్టారెంట్లు, హోటళ్ల అభివృద్ధిని సంస్థ విశ్లేషించింది.