NDL: మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నడిచే మార్గాల్లో గ్రీన్ మ్యాట్లు, చల్లటి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని, దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా నిర్వహిస్తున్నట్లు వివరించారు.
TPT: తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ బాగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. నారాయణగిరి షెడ్‌లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం 67,264 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 29,410 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లుగా నమోదైందని టీటీడీ వెల్లడించింది.
KKD: పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్, వైసీపి రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయిప్రసాద్‌ను జగ్గంపేట నియోజకవర్గం పరిశీలకుడిగా నియమిస్తు వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. నిరంతరం కేంద్ర కార్యాలయంతో నమన్యయం చేసుకుంటూ, జగ్గంపేట నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది.
SKLM: ఉమ్మడి ఏపీ మాజీ DGP హెచ్.జే దొర ఆకస్మిక మృతి పట్ల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం దిగ్భ్రాంతిని ప్రకటించారు. ఆయన మరణ వార్త తనను అమితంగా కలచివేసిందని అన్నారు. 1965 బ్యాచ్ IPS అధికారి అయిన దొర నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారి అని కొనియాడారు. అనంతరం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని కేంద్ర మంత్రి తెలిపారు.
PPM: పట్టణంలో శనివారం ఉదయం స్దానిక పోలీసులు ‘వజ్ర పహార్’ కార్యక్రమంలో భాగంగా కార్షన్ సెర్చ్‌ను నిర్వహించారు. ఎస్పీ ఎస్.వీ.మాధవరెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రెల్లి వీధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా 6 మోటార్ సైకిళ్ళు, 12 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధానపాత్రలో రానున్న చిత్రం ‘ధురంధర్ 2’. ఈ సినిమాలో అతిథిపాత్ర కోసం చిత్రబృందం అనిల్ కపూర్‌ను సంప్రదించగా.. అతడు నో చెప్పాడట. దీనిపై తాజాగా అనిల్ కపూర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘ఆ మూవీలో నటించాలని నేనూ కోరుకున్నా. కానీ, అప్పటికే మరో దర్శకుడికి డేట్స్ ఇచ్చేశాను. దీంతో ‘ధురంధర్ 2’లో నటించలేకపోయాను’ అని చ...
సత్యసాయి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ HJ దొర తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దొర శ్రీ సత్యసాయి బాబాకు చిరకాల భక్తుడు కావడంతో పుట్టపర్తి ప్రాంతంతో ఆయనకు విడదీయలేని అనుబంధం ఉంది. బాబా సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భక్తులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.
ATP: తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. పట్టణ అభివృద్ధి కోసం గత ఐదేళ్లుగా అందరూ కలిసి పనిచేశామని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ఎవరైనా సరే అభివృద్ధిని చూసే ఓటేయాలని ప్రజలను కోరాలని సూచించారు. పట్టణ ప్రగతి కోసం కృషి చేసే వారికే ప్రజలు మద్దతు ఇస్తారని పేర్కొన్నారు.
AKP: అచ్యుతాపురం మండలం జగ్గన్నపేట గ్రామంలో గల సత్తెమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలో ప్రవేశించి హుండీ తెరిచి భక్తులు సమర్పించిన కానుకలను ఎత్తుకెళ్లారని గ్రామస్తులు తెలిపారు. శనివారం ఉదయం చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. మూడు నెలల నుంచి హుండీని తెరవలేదన్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామన్నారు.
MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలో ఈనెల 16న తెలంగాణ క్రీడా పాఠశాల ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎంఈవో రాందాస్ తెలిపారు. 3వ తరగతి విద్యార్థులు, 4వ తరగతి ప్రవేశాల కోసం క్రీడలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు తమ వెంట ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, బోనో ఫైడ్ సర్టిఫికెట్లతో రావాలని సూచించారు.
ASF: జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. బెజ్జూర్ 40.1°C, కెరమెరి 39.8, సిర్పూర్ (టీ) 39.7, రెబ్బెన 39.5, కౌటాల 39.3, ఆసిఫాబాద్ 39.2, వాంకిడి 38.9, తిర్యాణి 38.9, దహెగాం 38.9, కాగజ్ నగర్ 38.7, జైనూర్ 38.7, చింతలమానేపల్లిలో 38.6 °Cలుగా నమోదు అయ్యాయి.
GNTR: తెనాలిలో మానవత్వం వెలుగు చూసింది. రైలు నుంచి పడిపోయి మృతి చెందిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిందం నాయక్ (39) మృతదేహానికి స్థానికులు అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లే స్థోమత లేకపోవడంతో కుర్రా శ్రీను, అతని మిత్ర బృందం ముందుకు వచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు.
SDPT: బెజ్జంకి మండలంలో ప్రారంభమైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా సర్పంచ్ బొల్లం శ్రీధర్ పెద్దన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కలసి ధైర్యం చెప్పారు. భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కష్టపడి చదివితే విజయాన్ని సాధించవచ్చని తెలిపారు.