HNK: కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ VC (వైస్ ఛాన్స్‌లర్) లింగమూర్తి తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు వివరాల ప్రకారం.. గత 6నెలలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు నెలలు HYDలో చికిత్స పొందగా.. ఆరోగ్యం క్షీణించడంతో వారం రోజుల క్రితం నివాసానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు. లింగమూర్తికి భార్య అంజలి, ఐదుగురు కుమార్తెలున్నారు.
HNK: కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ VC (వైస్ ఛాన్స్‌లర్) లింగమూర్తి తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు వివరాల ప్రకారం.. గత 6నెలలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు నెలలు HYDలో చికిత్స పొందగా.. ఆరోగ్యం క్షీణించడంతో వారం రోజుల క్రితం నివాసానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు. లింగమూర్తికి భార్య అంజలి, ఐదుగురు కుమార్తెలున్నారు.
KMR: మద్నూర్‌లో ఇవాళ పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షకు ఇద్దరు విద్యార్థులు గైర్హాజరైనట్లు మండల విద్యాశాఖ అధికారి రాములు తెలిపారు. జడ్పీహెచ్ఎస్ (బాయ్స్) కేంద్రంలో 250 మంది, రెసిడెన్షియల్ బాలుర కేంద్రంలో 220 మంది, ఉర్దూ మీడియం పాఠశాల కేంద్రంలో 165 మంది విద్యార్థులు పరీక్ష రాశారని వివరించారు.
ATP: గుత్తిలోని శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ వద్ద శనివారం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంచార్జ్ వాసగిరి మణికంఠ హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యకర్తలు జై పవన్ కళ్యాణ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కేక్‌ను కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
MNCL: మంచిర్యాలలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో కలెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా కాసేపు బ్యాట్ పట్టి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. నిత్య జీవితంలో వ్యాయామం ఒక భాగంగా ఉండాలని, శారీరక శ్రమతోనే ఆరోగ్యం సాధ్యమని పేర్కొన్నారు. క్రీడా పోటీలు ఉద్యోగుల్లో పని ఒత్తిడిని తగ్గిస్తాయని తెలిపారు.
AP: రాష్ట్రంలో మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా అణచివేస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రౌడీషీటర్లపై డ్రోన్లతో నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నేరాలు తగ్గినప్పటికీ, కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. నెల్లూరు తరహాలోనే అన్ని జిల్లాల్లో రౌడీ ముఠాలను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు శాఖను ఆదేశించారు.
AP: రాష్ట్రంలో మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా అణచివేస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రౌడీషీటర్లపై డ్రోన్లతో నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నేరాలు తగ్గినప్పటికీ, కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. నెల్లూరు తరహాలోనే అన్ని జిల్లాల్లో రౌడీ ముఠాలను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్ శాఖను ఆదేశించారు.
PPM: పార్వతీపురంలోని పార్వతినగర్‌లో ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా నేత్ర వైద్యాధికారి జీరు నగేష్ రెడ్డి తెలిపారు. నీటి కాసుల వ్యాధి ఉన్నవారికి ఉచితంగా నిమ్స్ హాస్పిటల్‌లో శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు తెలిపారు. గ్లకోమా నివారణ కార్యక్రమంలో బాగంగా కంటి సమస్యలు పరిష్కరించాలని ఈ కార్యక్రమం అన్నారు.
BHNG: యాదగిరిగుట్ట పట్టణంలో పాత గుట్ట రోడ్డు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “మన కృషి అగ్రి డ్రోన్ సెంటర్”ను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శనివారం రిబ్బన్ కట్ చేసి అగ్రి డ్రోన్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టడం ద్వారా రైతులకు ఎంతో ఉపయోగం చేకూరుతుందని తెలిపారు.
TPT: ఓజిలి(మం) జోస్యులవారికండ్రిగ వద్ద స్వర్ణముఖి నది నుంచి అనుమతులు లేకుండా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ వందల ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తూ లక్షల రూపాయల అక్రమ సంపాదన జరుగుతోందని చెబుతున్నారు. ప్రతిరోజూ భారీగా ఇసుక రవాణా జరుగుతున్న అధికారులు చర్యలు తీసుకోవాడం లేదని వారు అంటున్నారు.
KRNL: కౌతాళం సొసైటీ కార్యాలయంలో సహకార రాజీ పరిష్కార పథకం-2026 పై ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు కేడీసీసీ బ్యాంక్ సీఈవో కె. రామాంజనేయులు పాల్గొని పథకం ప్రయోజనాలను వివరించారు. సొసైటీలో ఖాతా ఉన్న, అర్హులైన రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌతాళం సొసైటీ ఛైర్మన్ అల్లూరి వెంకటపతి రాజు తెలిపారు.
WNP: గోపాల్ పేట్ శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి భారీ విరాళం ప్రకటించారు. రూ.2,50,000 విరాళం అందజేసి సీతారాముల కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలతో పాటు కళ్యాణోత్సవానికి వచ్చినటువంటి భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్ పేట్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కడప: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు 144 సెక్షన్ అమలు చేసి, సెంటర్ల వద్ద పోలీసు సిబ్బందిని నియమించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
WG: పాలకొల్లు MMKNM మున్సిపల్ హైస్కూల్లో మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం మధ్యాహ్నం భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం నాణ్యత, మెనూ అమలుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్ధుల పక్కనే కూర్చుని వారితో కలిసి భోజనం చేస్తూ.. వారి కుటుంబ వివరాలు, పాఠశాలకు వస్తున్న విధానంపై ఆత్మీయంగా ముచ్చటించారు.
NLR: నెల్లూరు 17వ డివిజన్ పార్థసారధి నగర్ ప్రాంతంలో నూతనంగా వేస్తున్న లే అవుట్‌ను టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి కార్పొరేషన్ కమిషనర్ నందన్ శనివారం పరిశీలించారు. లే అవుట్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు, ప్లాన్ తదితర పత్రాలను తనిఖీ చేశారు. అనంతరం 10వ డివిజన్ సరస్వతీ నగర్ ఓవెల్ మోడల్ స్కూల్ ప్రాంతంలో పర్యటించారు.