ATP: గుత్తిలోని శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ వద్ద శనివారం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంచార్జ్ వాసగిరి మణికంఠ హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యకర్తలు జై పవన్ కళ్యాణ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కేక్‌ను కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు.