ఎన్టీఆర్: నందిగామ MLA తంగిరాల సౌమ్యను హౌసింగ్ కార్పొరేషన్ ఎస్సీ, ఎస్టీ యూనియన్ నాయకులు శనివారం కలిశారు. సంస్థలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ ఆమెకు వినతిపత్రం అందజేశారు. దళిత ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా CM చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విన్నవించారు.