KMR: మద్నూర్‌లో ఇవాళ పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షకు ఇద్దరు విద్యార్థులు గైర్హాజరైనట్లు మండల విద్యాశాఖ అధికారి రాములు తెలిపారు. జడ్పీహెచ్ఎస్ (బాయ్స్) కేంద్రంలో 250 మంది, రెసిడెన్షియల్ బాలుర కేంద్రంలో 220 మంది, ఉర్దూ మీడియం పాఠశాల కేంద్రంలో 165 మంది విద్యార్థులు పరీక్ష రాశారని వివరించారు.