HNK: కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ VC (వైస్ ఛాన్స్లర్) లింగమూర్తి తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు వివరాల ప్రకారం.. గత 6నెలలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు నెలలు HYDలో చికిత్స పొందగా.. ఆరోగ్యం క్షీణించడంతో వారం రోజుల క్రితం నివాసానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు. లింగమూర్తికి భార్య అంజలి, ఐదుగురు కుమార్తెలున్నారు.