• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘అక్రమంగా సిలిండర్లు నిల్వ చేస్తే చర్యలు’

NRPT: అక్రమంగా సిలిండర్లు నిల్వ చేసుకుంటే వాటిని సీజ్ చేయడం జరుగుతుందని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ సైదులు తెలిపారు. శనివారం హోటళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించి 14 గృహ ఎల్పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వాటిని భద్రంగా ఉంచడానికి గురు కృప భారత్ గ్యాస్ ఏజెన్సీకి అప్పగించామని అన్నారు.

March 14, 2026 / 03:03 PM IST

జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షకు 99.8% హాజరు

వరంగల్ జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రారంభమైనట్లు DEO రంగయ్య తెలిపారు. మొదటి రోజు 9,485 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 9,475 మంది హాజరై 99.8 శాతం హాజరు నమోదైంది. 10 మంది మాత్రమే గైర్హాజరయ్యారు. పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని DEO పేర్కొన్నారు.

March 14, 2026 / 03:02 PM IST

6 సిలిండర్లు సీజ్

MDK: రామాయంపేట మండల కేంద్రంలోని పలు హోటళ్లలో పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న 6 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను సీఐ, ఎస్సై ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వినియోగంపై పూర్తి స్థాయి 6A నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సూచించారు.

March 14, 2026 / 03:01 PM IST

గిరిజనులకు చట్టాలపై అవగాహన

ASR: అరకులోయ మండలం సిర్గాం పంచాయతీ లంతంపాడు గ్రామంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డా. కంబిడి కృష్ణకుమారి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులతో సమావేశమై పలు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల హక్కులు, ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అనంతరం గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుస్తులను పంపిణీ చేశారు.

March 14, 2026 / 03:01 PM IST

‘ఔట్ సోర్సింగ్‌లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి’

MNCL: ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో జారీ చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం మంచిర్యాలలో మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు ఉండగా.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 9 శాతం మాత్రమే ఉన్నారని తెలిపారు.

March 14, 2026 / 03:00 PM IST

గ్యాస్ కొరతపై ఏపీ హోటల్ అసోసియేషన్ సభ్యులు సమావేశం

VZM: జిల్లాలో గ్యాస్ కొరతపై ఏపీ హోటల్ అసోసియేషన్ సభ్యులు ఇవాళ ఓ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా అసోసియేషన్ అధ్యక్షుడు జి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. లక్షల మందికి ఉపాధి దూరమవుతుందన్నారు.. గ్యాస్ బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

March 14, 2026 / 03:00 PM IST

‘నల్గొండ ప్రజల గోసను చూడండి’

NLG: మూసీ మురికి జలాలతో నల్గొండ ప్రజలు పడుతున్న నరకయాతనను ప్రతిపక్షాలు స్వయంగా చూడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. హయత్‌నగర్‌లో రోడ్డు విస్తరణ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కలుషిత నీటి వల్ల ప్రజలు 35 ఏళ్లకే 60 ఏళ్ల వృద్ధుల్లా మారిపోతున్నారన్నారు. కిడ్నీ, క్యాన్సర్ వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

March 14, 2026 / 03:00 PM IST

ముస్మి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు

MHBD: కొత్తగూడ మండలం ముస్మి గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం గ్రామ సర్పంచ్ దేవేందర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సర్పంచ్ సహకారంతో గ్రామంలోని ప్రధాన కూడళ్లలో రెండు సీసీ కెమెరాలను అమర్చారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా, దొంగతనాల నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై రాజకుమార్ సర్పంచ్‌ను అభినందించారు.

March 14, 2026 / 03:00 PM IST

1400 లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం

AKP: నాతవరం మండలం గాంధీనగరం సమీపంలోని అటవీ ప్రాంతంలో హెడ్ కానిస్టేబుల్ గిరి ఆధ్వర్యంలో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సారా తయారీకి ఉపయోగించే 1400 లీటర్ల బెల్లం పులుపును, సామాగ్రిని ధ్వంసం చేయడం జరిగింది. సారా తయారీ, రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నామని ఎస్ఐ వై.తారకేశ్వరరావు పేర్కొన్నారు.

March 14, 2026 / 03:00 PM IST

RDT మనుగడపై తోపుదుర్తి ఆందోళన

ATP: జిల్లా ప్రజల పాలిట సంజీవని లాంటి RDT సంస్థ పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. FCRA విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న పద్ధతి బ్రిటీష్ పాలనను తలపిస్తోందని విమర్శించారు. 50 ఏళ్లుగా విద్య, వైద్యం, క్రీడలు, మహిళా సాధికారత రంగాల్లో RDT అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.

March 14, 2026 / 02:59 PM IST

‘గోటీల ఫ్యాక్టరీ’ వార్తలపై రాజశేఖర్ క్లారిటీ

గోటీల వ్యాపారంతో నటుడు రాజశేఖర్ రూ.3 కోట్లు-4 కోట్లు సంపాదిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై రాజశేఖర్  స్పందించాడు. అందులో నిజం లేదని, తనకు గోటీల ఫ్యాక్టరీ లాంటిది లేదని స్పష్టం చేశాడు. అలాంటి ఆలోచన కూడా లేదని, ఎవరో కావాలని క్రియేట్ చేశారని చెప్పాడు. ముఖ్యంగా వార్తలను చూసి నవ్వుకున్నానని తెలిపాడు.

March 14, 2026 / 02:58 PM IST

‘విమర్శించే ముందు నియోజకవర్గంపై దృష్టి పెట్టాలి’

ప్రకాశం: Dy.CM పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించే ముందు నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన జాయింట్ సెక్రెటరీ, పెద్దారవీడుకు చెందిన చిన్న పాల్ సూచించారు. పారదర్శక పాలనను చూసి ఓర్వలేక అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని, అటవీ శాఖను ప్రక్షాళన చేస్తూ అడవి బిడ్డల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని వెల్లడించారు.

March 14, 2026 / 02:58 PM IST

ప్రశాంతంగా పదో తరగతి తెలుగు పరీక్ష

SRPT: జిల్లాలో శనివారం పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 69 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 12,355 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 12,342 మంది హాజరయ్యారు. 13 మంది గైర్హాజరయ్యారు. అధికారులు 37 కేంద్రాలను తనిఖీ చేశారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని, పరీక్షలు సజావుగా నిర్వహించామని జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ తెలిపారు.

March 14, 2026 / 02:57 PM IST

బుక్కపట్నంలో అయ్యప్ప స్వామి ఆలయానికి భూమి పూజ

సత్యసాయి: బుక్కపట్నంలోని శ్రీ చౌడేశ్వరి మాత ఆలయ సమీపంలో అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి భూమి పూజ చేశారు. ఆలయాల నిర్మాణంతో సమాజంలో ఆధ్యాత్మికత, భక్తిభావం పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. దైవచింతన మనిషిని సన్మార్గంలో నడిపిస్తుందని, మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మికత ఎంతో అవసరమని తెలిపారు.

March 14, 2026 / 02:56 PM IST

మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన ఛైర్‌పర్సన్ పల్లవి

ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి శనివారం యార్డ్‌ను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వ్యాపారులు, రైతులతో నేరుగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యార్డ్‌లో మౌలిక వసతుల కల్పన, క్రయవిక్రయాల్లో పారదర్శకతపై ప్రత్యేకంగా చర్చించారు.

March 14, 2026 / 02:55 PM IST