ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ బల్లా పల్లవి శనివారం యార్డ్‌ను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వ్యాపారులు, రైతులతో నేరుగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యార్డ్‌లో మౌలిక వసతుల కల్పన, క్రయవిక్రయాల్లో పారదర్శకతపై ప్రత్యేకంగా చర్చించారు.