• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉపయోగం లేని ఉపాధి హామీ పథకం.. ప్రజల ఆందోళన

SKLM: ప్రజా అవసరాల కోసం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం పనులు కొన్ని ప్రాంతాల్లో ఉపయోగపడడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రం సారవకోట పంచాయతీ కొత్తపేట పొట్టి వాని కోనేరు రూ.9.90 లక్షలతో 2024లో పని చేస్తే ఏడాది కాకముందే చెరువు పూర్తిగా కప్పకు పోయి ఉపయోగం లేకుండా పోయినట్లు విమర్శలు ఉన్నాయి. పనులుపై అధికారులు దుష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

March 14, 2026 / 05:00 PM IST

రెళ్ల గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయం ప్రతిష్ట

PPM: గుమ్మలక్ష్మీపురం మండలంలోని రెళ్ల గ్రామంలో నిర్మించనున్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం ప్రతిష్ట కోసం యాగశాల ముహూర్తం రాయిని ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యులు కడ్రక మల్లేశ్వరరావు, గ్రామ సర్పంచ్ మండంగి శంకరరావు చేతుల మీదుగా వేశారు. ఈ సందర్భంగా ప్రజలు దైవభక్తితో జీవించాలని మల్లేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

March 14, 2026 / 05:00 PM IST

ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి: డా. రమేష్ రెడ్డి

SDPT: మార్చి నెలలోనే ఎండలు 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఎండాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి ప్రజలకు సూచనలు చేశారు. ఎండలకు ఎక్కువ నీటిని తాగాలని.. దీంతో శరీరంలో నీటి శాతం పెరుగుతుందన్నారు. అవసరమైతే తప్ప బయటికి రాకూడదని సూచించారు.

March 14, 2026 / 05:00 PM IST

రోడ్డుపై రెండు బైకులు ఢీ

CTR: పూతలపట్టు(మం) RVS నగర్ వద్ద శనివారం రెండు బైకులు ఢీకొన్నాయి. స్థానికుల వివరాల మేరకు.. వేల్కూరు చెందిన హేమంత్, అతని ఫ్రెండ్ చిత్తూరు నుంచి బైకుపై వస్తుండగా దారి మధ్యలో మరో బైకు వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

March 14, 2026 / 04:59 PM IST

ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్.. ముగ్గురు మృతి

TG: మెదక్‌ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మృతులు హవేలీఘనపూర్ మండలం బూరుపల్లి వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

March 14, 2026 / 04:58 PM IST

వారిని చూసి తట్టుకోలేకపోయా: పవన్ కళ్యాణ్

AP: గిరిజనుల కష్టాలను చూసి రహదారుల నిర్మాణానికి ముందుకొచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లూరి జిల్లా నందిగరువులో గిరిజనులతో ఆయన మాట్లాడుతూ.. ప్రజల కష్టాలను తీర్చేందుకే కూటమి ప్రభుత్వం ఉందని భరోసా ఇచ్చారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా.. తనతో పంచుకోవాలని కోరారు. సరైన రహదారి లేకుండా గిరిజనులు ఇబ్బంది పడుతుంటే చూసి తట్టుకోలేకపోయానన్నారు.

March 14, 2026 / 04:57 PM IST

రోహిత్‌పై మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

IPLలో రోహిత్ శర్మను కేవలం ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా కాకుండా, పూర్తిస్థాయి ప్లేయర్‌గా ఆడించాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. హిట్‌మ్యాన్ ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, కెప్టెన్‌గా ఇప్పటికే 5 ట్రోఫీలు అందించిన అనుభవం అతడికి ఉందని గుర్తు చేశాడు. అలాంటి ప్లేయర్ సేవలను మైదానంలో పూర్తిస్థాయిలో వాడుకోవాలని అభిప్రాయపడ్డాడు.

March 14, 2026 / 04:57 PM IST

ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

కృష్ణా: పెడన మండలం చేవెండ్ర గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి, మిగిలిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

March 14, 2026 / 04:55 PM IST

యుద్ధం ఎఫెక్ట్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ బుకింగ్‌లు

WGL: యుద్ధం కారణంగా ఉమ్మడి జిల్లాలో LPG సిలిండర్ల బుకింగ్‌లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా WGL జిల్లాలోని 16 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో జనవరి నెలలో రోజుకు సుమారు 16 వేల బుకింగ్లు ఉండగా.. నిన్న ఒక్క రోజే 59,200 బుకింగ్‌లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో అత్యవసర అవసరం ఉన్నవారికి సిలిండర్లు ఆలస్యంగా అందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

March 14, 2026 / 04:55 PM IST

BREAKING: ప్రమాదం.. ముగ్గురు మృతి

TG: భూపాలపల్లిలోని మొగుళ్లపల్లి మండలం కొరికిశాలలో ఘోర ప్రమాదం జరిగింది. బావి పూడిక తీస్తుండగా క్రేన్ వైర్ తెగి ముగ్గురు మృతి చెందారు. మృతులు దేవరావు, అభిలాష్, పైడిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 14, 2026 / 04:54 PM IST

పెద్ద మునిగల్‌లో వ్యక్తి అదృశ్యం

NLG: దేవరకొండ నియోజకవర్గం నేరేడుగోమ్ము మండలం, పెద్ద మునిగల్ గ్రామానికి చెందిన దాచేపల్లి చెన్నయ్య గత రెండు రోజులుగా కనిపించడం లేదు. ఆయన మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా ఆయనను ఎక్కడైనా చూసినా లేదా ఆచూకీ తెలిసినా దయచేసి వెంటనే 8008823448, 9989437017 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

March 14, 2026 / 04:53 PM IST

మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి: ఎస్పీ

WNP: రైతులు కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం రైస్ మిల్లులకు ఉపయోగించిన తర్వాత దానిపై ఏ విధమైన అక్రమాలు, నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తప్పవని జిల్లా SP సునీత రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పోలీస్ కార్యాలయంలో అధికారులతో విచారణ సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ పడ్డీ కేసులను వేగవంతంగా విచారించి త్వరగా పూర్తి చేయాలని తెలియజేశారు.

March 14, 2026 / 04:52 PM IST

ఆపదలో ఉన్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ అండ: ఎమ్మెల్యే

కోనసీమ: ఆపదలో ఉండి వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న ప్రతి పేదవాడికి మన కూటమి ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. శనివారం అమలాపురం పట్టణంలో ఉన్న తన క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గంలో 52 మంది లబ్ధిదారులకు సుమారు రూ.44 లక్షల 98 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

March 14, 2026 / 04:50 PM IST

ముగిసిన న్యాయవాదుల నిరసన

PDPL: గోదావరిఖని వన్ టౌన్ పోలీసుల తీరుకు నిరసనగా గత నెల రోజులుగా న్యాయవాదులు చేపట్టిన నిరసనలు ముగిశాయి. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధుల బహిష్కరణతో పాటు పలు విభిన్న నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇద్దరు న్యాయమూర్తులు, పోలీసు ఉన్నతాధికారులు న్యాయవాదులతో జరిపిన చర్చలతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. ఇకనుంచి విధులకు హాజరు కానున్నారు.

March 14, 2026 / 04:50 PM IST

నూతన ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

ఏలూరు: నగరంలోని వన్ టౌన్ 8వ డివిజన్‌లోని కొత్త రోడ్డులో శ్రీ ఆదర్శ ఆంజనేయ స్వామి వారి నూతన ఆలయ నిర్మాణ పనులకు నిర్వాహకులు శనివారం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు. అనంతరం ఆలయం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

March 14, 2026 / 04:48 PM IST