TG: మంచిర్యాలలోని కవ్వాల్ టైగర్ ఫారెస్ట్‌లో చిరుత మృతి చెందింది. ముగ్గురు నిందితులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఉచ్చులో చిక్కిన చిరుతను కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు. చిరుత గోళ్లు, కళేబరం తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.
JGL: జగిత్యాల పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో జరగనున్న శ్రీరామనవమి వేడుకల సందర్భంగా నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రికను జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రావాలని పద్మశాలి సేవా సంఘం కార్యవర్గ సభ్యులు ఆహ్వానించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని నందయ్య కోరారు.
BDK: దమ్మపేట మండలం గడుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన విద్యార్థులను శనివారం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనశాలను పరిశీలించి విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని వర్కర్లను ఆదేశించారు.
హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాకలో విషాదం చోటుచేసుకుంది. ఈనెల 4న అదృశ్యమైన గౌతమ్ కుమార్(20) అనే యువకుడు, రాజన్న బావి సమీపంలోని పులమ్మ బావిలో శవమై తేలాడు. ట్యాంక్ బండ్ శివ టీమ్ సాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MNCL: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్‌లో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ప్రజలకు ఆరోగ్యకర వాతావరణం కల్పించేందుకు పారిశుద్ధ్య పనులను నిరంతరం కొనసాగించాలన్నారు.
శ్రీకాకుళంలోని మున్సిపల్ ఆఫీసులో నగరంలో జరుగుతున్న డ్రైనేజీ పనులు, మంచినీటి పైపులైన్లు పనుల పై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వార్డు ఎమినిటీస్, శానిటరీ అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ వార్డుల్లో ఎంతవరకు పనులు జరిగాయని రిపోర్టు రూపంగా చూపించాలని ప్రశ్నించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయకూడదు అన్నారు.
KNR: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా సాగేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. శనివారం మొదటిరోజు కరీంనగర్‌లో ఓల్డ్ హై స్కూల్, ధన్గర్ వాడి పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు.
KDP: సిద్ధవటం మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామికి శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూల అలంకరణ, త్రికాలారాధన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
VZM: రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత, వడగాలులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శనివారం సూచించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో ఎక్కువ సమయం పని చేయకుండా ఉండాలని, తరచుగా నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవాలని చెప్పారు. వడదెబ్బకు గురైన వారిని వెంటనే నీడలోకి తీసుకెళ్లాలన్నారు.
ATP: అనంతపురం గీతా మందిరంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు, అహుడ ఛైర్మన్ టీసీ వరుణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పవన్ కల్యాణ్ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని, పదివేల సభ్యత్వాలే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అంనతరం ఏర్పాటుచేసిన శిబిరంలో జనసైనికులు రక్తదానం చేశారు.
HYD: RRR చుట్టూ ప్రతిపాదిత రింగ్ రైల్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు DPR సిద్ధం చేసేందుకు రైల్వే శాఖ అనుమతించినట్లు ఆయన తెలిపారు. ఇది పూర్తయితే నగర శివార్ల రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
KMM: రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని పెన్షన్ దారుల సంఘం జిల్లా కన్వీనర్ యలమద్ది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం బోనకల్లో నిర్వహించిన పీఆర్పీఏ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 మార్చి తర్వాత పదవీ విరమణ పొందిన వారికి గ్రాట్యువిటీ, ఇతర ప్రయోజనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
BDK: జిల్లాలో నిర్వహిస్తున్న పదవ తరగతి వార్షిక పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. శనివారం పాల్వంచ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత బాలికల అభ్యుదయ పాఠశాల పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించబడుతున్నాయా? లేదా? అనే అంశాలను పరిశీలించారు.
MHBD: కురవి మండలం బలపాల గ్రామంలో నూతన విద్యుత్ లైన్ పనులను శనివారం గ్రామ సర్పంచ్ బిక్కు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ నుంచి వైకుంఠధామం వరకు ఈ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు రాత్రి వేళల్లో ఇబ్బంది కలగకుండా ప్రతి స్తంభానికి విద్యుత్ లైట్లను అమర్చుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు ఉన్నారు.
NGKL: ఈనెల 18న కల్వకుర్తి పశువుల సంత వేలం వేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ షేక్ మహమూద్ తెలిపారు. పశువుల సంతతో పాటు తై బజార్, వధశాలకు వేలంపాట నిర్వహిస్తామని పేర్కొన్నారు. వేలం పాటలో పాల్గొనే వారు డిపాజిట్ చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. పశువుల సంతకు రూ.10 లక్షలు, తై బజార్‌కు రెండు లక్షలు, వధశాలకు రూ.20,000 డిపాజిట్ చెల్లించాలని కోరారు.