• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘అవినీతి జరిగిందని ఆధారాలతో నిరూపించాలి’

MNCL: అధికార పార్టీపై బురదజల్లడం అలవాటుగా మారిందని MLA వినోద్ శనివారం ప్రకటనలో మండిపడ్డారు.ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వారు, దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు, PA లపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలుగా మాట్లాడటం సరికాదన్నారు.

March 14, 2026 / 04:27 PM IST

బనగానపల్లె‌లో పర్యటించిన మంత్రి

NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని అన్ని మసీదులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సందర్శించారు. రంజాన్ పండుగ సందర్భంగా పలు మసీదులలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం మత పెద్దలైన ఇమామ్, మౌజానులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దుస్తులను పంపిణీ చేశారు.

March 14, 2026 / 04:27 PM IST

సూళ్లూరుపేటలో జువెలరీ షాపులో దోపిడి.!

TPT: సూళ్లూరుపేటలోని కచేరి వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర జువెలెర్స్‌లో శనివారం దోపిడి జరిగింది. కొనుగోలు చేస్తున్నట్లు నటించిన దుండగుడు షాపు యజమాని కళ్లలో కారం పొడి చల్లి సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు నగలను అపహరించి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా దుండగుడిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.

March 14, 2026 / 04:26 PM IST

‘నాగయ్యపల్లి గ్రామాభివృద్ధికి సహకరిస్తా’

HNK: ఆత్మకూరు మండలంలోని నాగయ్యపల్లి గ్రామాభివృద్ధికి సహకరిస్తానని కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన నాగయ్యపల్లి గ్రామ ఉప సర్పంచ్ కరుణాకర్, నేతలతో భేటీ అయ్యారు. గ్రామ అభివృద్ధి, ఇతర రాజకీయ అంశాలపై కాసేపు ఛైర్మన్‌తో వారు చర్చించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఛైర్మన్ తెలిపారు.

March 14, 2026 / 04:25 PM IST

PGRSలో ఫిర్యాదు.. ఒకరి ఆస్తిని మరొకరికి రిజిస్ట్రేషన్..!

W.G: సరైన డాక్యుమెంట్స్ లేకుండా ఒకరి ఆస్తిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన ఘటన ఆకివీడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చోటుచేసుకుంది. దుంపగడపకు చెందిన భూమిని నూజివీడుకి చెందిన వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడంతో బాధితులు PGRSలో ఫిర్యాదు చేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో.. రిజిస్టర్ గతంలో కూడా ఇలాగే బంధువులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు.

March 14, 2026 / 04:25 PM IST

మామిడి తోటలో అగ్నిప్రమాదం

CTR: చౌడేపల్లి(మం) బిల్లేరు ఖానా సాహెబ్ మిట్ట వద్ద శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అన్సర్ బాషాకు చెందిన మామిడి తోటలో మంటలు రేగినట్టు తమకు సమాచారం అందినట్టు పుంగనూరు ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు. సిబ్బంది అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో మంటలు అదుపు చేసినట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో రూ. 10 వేల నష్టం వాటిల్లినట్టు బాధితుడు తెలిపారు.

March 14, 2026 / 04:25 PM IST

సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్ 

TG: సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. HYD చుట్టూ నిర్మించ తలపెట్టిన ‘రీజినల్ రింగ్ రైల్’ ప్రాజెక్టు విషయంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు DPRకు అవసరమైన సర్వేకు అనుమతిస్తూ కేంద్రమంత్రి రవనీత్ సింగ్.. MP చామల కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. కాగా ఈ ప్రాజెక్టును ఆమోదించాలని ఇప్పటికే పలు సందర్భాల్లో CM కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

March 14, 2026 / 04:25 PM IST

మాజీ DGP పార్థివ దేహానికి నివాళులర్పించిన MLA

WGL: HYDలోని జూబ్లీహిల్స్ లో శనివారం మాజీ డీజీపీ HJ దొర అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో వర్ధన్నపేట MLA, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఆయన భౌతిక దేహానికి MLA పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ డీజీపీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, ప్రముఖులు ఉన్నారు.

March 14, 2026 / 04:23 PM IST

పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలి: ఆడే గజేందర్

ADB: ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. శనివారం తాంసి మండలం కప్పర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, తదితరులున్నారు.

March 14, 2026 / 04:23 PM IST

ఫిరంగిపురంలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

GNTR: ఫిరంగిపురం గ్రామంలో పరిశుభ్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాన్ని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఇంటి వద్ద ఉన్న చెత్తను ప్రజలు వేరు చేసి ఈ వాహనానికి అందజేస్తే, దానికి బదులుగా నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందన్నారు. పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.

March 14, 2026 / 04:22 PM IST

ఆ మూవీ ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసు: రాశి ఖన్నా

‘తెలుసు కదా’ సినిమా రిజల్ట్‌పై రాశి ఖన్నా షాకింగ్ కామెంట్స్ చేసింది. షూటింగ్ సమయంలోనే సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో తనకు అర్థమైందని, కథలోని కొన్ని పాయింట్లు ప్రేక్షకులకు కనెక్ట్ కావని యూనిట్‌కు ముందే చెప్పానని ఆమె పేర్కొంది. డైరెక్టర్ నీరజ కోన విజన్‌పై నమ్మకంతోనే బాధ్యతగా నటించానని రాశి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

March 14, 2026 / 04:22 PM IST

విశ్వశాంతి భవన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ

KDP: పులివెందులలో ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి విశ్వశాంతి భవన్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉద్ఘాటన వేడుకల్లో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రాజయోగిని జయంతితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

March 14, 2026 / 04:21 PM IST

త్వరలో బీసీ రక్షణ చట్టం: మంత్రి సవిత

AP: త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకురాబోతున్నట్లు మంత్రి సవిత తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముసాయిదా సిద్ధం చేసినట్లు చెప్పారు. కులం, వృత్తి పేరుతో దూషిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీసీల మానప్రాణాలకు భరోసా కల్పించేలా బీసీ రక్షణ చట్టం తీసుకురాబోతున్నట్లు తెలిపారు. బీసీలను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు.

March 14, 2026 / 04:21 PM IST

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

NRML: సారంగాపూర్ మండలంలోని కౌట్ల (బి) గ్రామ రైతు పరస్పర సహకార సంఘం సభ్యులు, తమ పంటలైన జొన్నలు, మొక్కజొన్నల కొనుగోలు కోసం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ, నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఇప్పటికే సంబంధిత అధికారులు అందరికీ వినతి పత్రాలు సమర్పించినట్లు వారు తెలిపారు.

March 14, 2026 / 04:20 PM IST

విజ్ఞాన యాత్రకు సాయం అందజేత..!

NLG: చిట్యాల మండలం వట్టిమర్తి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల విజ్ఞాన యాత్రకు సామాజిక సేవకుడు నర్రా వేణు మోహన్ రెడ్డి రూ.10,000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా హెడ్‌మాస్టర్ జానకి మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర వికాసానికి ఇలాంటి యాత్రలు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ శ్రీలత శ్రీను విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

March 14, 2026 / 04:20 PM IST