NZB: సమాజ అభివృద్ధి కోసం ఆర్యవైశ్యులు మరింతగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. శనివారం సుచిత్ర, కొంపల్లి ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
WNP: ఉత్తమ అధికారులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన వనపర్తికి చెందిన రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసిన జన్ను వెంకటరమణను శనివారం సాహితీ కళా వేదిక ప్రతినిధులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
SKLM: సోంపేట పట్టణంలోని పల్లె పుష్కరిణి కార్యక్రమంలో భాగంగా రామ సాగరం చెరువు సుందరీకరణ పనులకు ఇచ్చాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అశోక్ బాబు హాజరై శనివారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. రూ.50 లక్షలతో చేపట్టనున్న ఈ సుందరీకరణ పనులు పూర్తయితే చెరువు పరిసర ప్రాంతం అందంగా మారుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
KRNL: ఎవరైనా గంజాయి సాగు చేసినా, అక్రమంగా నిల్వ ఉంచినా చట్టపరంగా చర్యలు తప్పవని డీఎస్పీ వెంకట రామయ్య హెచ్చరించారు. ఆలూరులో ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గంజాయి సాగు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పరి, డేగులపాడు ప్రాంతాల్లో గంజాయి లభ్యమైన ఘటనను ప్రస్తావిస్తూ.. అక్కడ ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.
కృష్ణా: గుడివాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో, పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. జనసేన నాయకులు, కార్యకర్తలకు నియోజకవర్గ ఇంఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. అట్టడుగు వర్గాలకు అండగా, బడుగు బలహీన, పేద మధ్యతరగతి వర్గాల కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
AP: తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వారాంతపు సెలవుల నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీ అమాంతం పెరిగిపోయింది. దీంతో టీటీటీ అధికారులు వాహనాల రద్దీని నియంత్రిస్తున్నారు.
NDL: పాములపాడు మండలం మద్దూరులో శ్రీ శ్రీ ఈశ్వర వీరభద్ర స్వామి దేవాలయం పునర్మానానికి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య భూమి పూజ నిర్వహించారు. దేవాలయ కమిటీ రూ.14 లక్షల మ్యాచింగ్ గ్రాంట్, కూటమి ప్రభుత్వం రూ. 56 లక్షల సీజీఎఫ్ గ్రాంట్ మంజూరు చేసింది. మొత్తం రూ. 70 లక్షలతో శ్రీ ఈశ్వర వీరభద్ర స్వామి నూతన దేవాలయ పునర్మాణానికి పూజ కార్యక్రమం నిర్వహించారు.
KMR: కామారెడ్డి శివారులో రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణం గుండా జాతీయ రహదారి ఉన్నందున, పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా రింగ్ రోడ్డు ఆవశ్యకతను వివరించారు.
NTR: విజయవాడ నగరపాలక సంస్థ కళ్యాణ మండపంలోని టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా కిట్లను ఎంపీ కేశినేని చిన్ని మహిళలకు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రంజాన్ మాసం దానధర్మాలకు, పరస్పర ప్రేమాభిమానాలకు ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
PDPL: గోదావరిఖని మేదరి బస్తీకి చెందిన పిల్లి కుమార్ అనే వ్యక్తి, ఇంటి పైకప్పుకు లుంగీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమార్ ఎలాంటి పని చేయకపోగా, కొద్ది రోజుల నుంచి మద్యానికి బానిసయ్యాడు. భార్య రజిత కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుందని వెల్లడించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KRNL: ఆదోని జిల్లా సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను ఇవాళ ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ సందర్శించారు. ఇవాళ ఈ దీక్షలు 119వ రోజుకు చేరుకోవడం ఆదోని చరిత్రలో ఆల్ టైం రికార్డుగా నిలిచిందని పేర్కొన్నారు. ఆదోని జిల్లా సాధన పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్న ప్రజలకు నూర్ అహ్మద్ కృతజ్ఞతలు తెలిపారు.
BDK: చర్ల మండలం ఎంపీడీవో కార్యాలయం శనివారం కళ్యాణ లక్ష్మి చెక్కుల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొని 45 కుటుంబాలకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏన్నో మధ్యతరగతి కుటుంబాలకు కల్యాణ లక్ష్మి అండగా నిలుస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారుల పాల్గొన్నారు.
KNR: డాక్టర్ బి.యన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యో గుల సమస్యలపై సదస్సు ఈరోజు ఫిలిం భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ.. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలను ప్రభుత్వం పెంచాలని సూచించారు.
KMM: తిరుమలాయపాలెం మండలం రాజారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వారంరోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందారు. గ్రామానికి చెందిన మెట్టు వెంకన్న (55), ఆయన భార్య రాధ (50) గుండెపోటుతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.