• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BDK: చర్ల మండలం ఎంపీడీవో కార్యాలయం శనివారం కళ్యాణ లక్ష్మి చెక్కుల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొని 45 కుటుంబాలకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏన్నో మధ్యతరగతి కుటుంబాలకు కల్యాణ లక్ష్మి అండగా నిలుస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారుల పాల్గొన్నారు.

March 14, 2026 / 04:12 PM IST

నిరుద్యోగుల సమస్యలపై సదస్సు

KNR: డాక్టర్ బి.యన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యో గుల సమస్యలపై సదస్సు ఈరోజు ఫిలిం భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ.. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలను ప్రభుత్వం పెంచాలని సూచించారు.

March 14, 2026 / 04:11 PM IST

వారం వ్యవధిలో భార్యాభర్తల మృతి

KMM: తిరుమలాయపాలెం మండలం రాజారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వారంరోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందారు. గ్రామానికి చెందిన మెట్టు వెంకన్న (55), ఆయన భార్య రాధ (50) గుండెపోటుతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

March 14, 2026 / 04:10 PM IST

గాంజాయి మత్తులో యువకుడి వీరంగం

WGL: గాంజాయి మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. మత్తుకు బానిసైన యువకుడు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంభునిపేటలో బీభత్సం సృష్టించాడు. మత్తు పదార్థాలు తమ ఇంటి ప్రాంతంలో సేవించవద్దని చెప్పిన వారిపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

March 14, 2026 / 04:10 PM IST

గొప్ప పథకాన్ని మోదీ చంపేస్తున్నారు: షర్మిల

AP: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం పేదలకు భరోసా అని ఏపీసీసీ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. పాకరావుపేటలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేపట్టిన పరిరక్షణ యాత్రలో భాగంగా మన్రేగా చట్టాన్ని పునరుద్ధరించాలి. గ్రామాల్లో పేదరికాన్ని రూపుమాపి, వలసలు నివారించిన పథకం ఇది. ఇలాంటి గొప్ప పథకాన్ని మోదీ చంపేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో ఉపాధి లేకుండా ఊపిరితీస్తున్నారు’ అంటూ విమర్శించారు.

March 14, 2026 / 04:08 PM IST

ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన నూతన అధ్యక్షులు

ATP: రుద్రంపేట, తాడిమర్రి మండలాల వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) నూతన అధ్యక్షులు, సభ్యులు అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీతను మర్యాదపూర్వకంగా కలిశారు. రుద్రంపేట అధ్యక్షునిగా కాటిగానికాలువ శ్రీనివాసులు, తాడిమర్రి అధ్యక్షునిగా కునుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి తమ సభ్యులతో కలిసి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

March 14, 2026 / 04:07 PM IST

వాడపల్లిలో రేపటి నుంచి వేద అధ్యయనోత్సవాలు

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం నుంచి 19వ తేదీ వరకు వేద అధ్యయనోత్సవాలు జరుగుతాయని ఆలయ డీసీ చక్రధరరావు తెలిపారు. ప్రతి రోజు ద్రవిడ వేద పారాయణం జరుగుతుందన్నారు. ఆదివారం గ్రామోత్సవం జరుగుతుందన్నారు. సోమవారం గరుడ వాహన సేవ, మంగళవారం సింహ వాహన సేవ, బుధవారం హంస వాహన సేవ ఏర్పాటు చేశామన్నారు

March 14, 2026 / 04:07 PM IST

ప్రతి కార్యకర్తలో సేవాభావం ఉండాలి: సత్యకుమార్

AP: దేశ సరిహద్దుల భద్రత, జాతీయ భద్రత, దేశ భవిష్యత్తు అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్-2026 కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, సేవాభావం ప్రతి కార్యకర్తలో ఉండాలని సూచించారు.

March 14, 2026 / 04:06 PM IST

బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ మాజీ మంత్రి!

TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈనెల 20 తర్వాత బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. కాగా ఇటీవల పార్టీలో తనకు సరైన గుర్తింపు ఉండటం లేదని జీవన్ రెడ్డే స్వయంగా పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

March 14, 2026 / 04:06 PM IST

బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ సీనియర్ నేత!

TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈనెల 20 తర్వాత బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. కాగా ఇటీవల పార్టీలో తనకు సరైన గుర్తింపు ఉండటం లేదని జీవన్ రెడ్డే స్వయంగా పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

March 14, 2026 / 04:06 PM IST

ఉగాది సాంస్కృతికోత్సవం కనువిందు

VZM: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది సాంస్కృతికోత్సవం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని సిరమ్మ ప్రారంభించగా, చిన్నారుల నృత్యాలు, కళాకారుల గీతాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా పలువురికి ఉగాది పురస్కారాలు అందజేశారు.

March 14, 2026 / 04:06 PM IST

త్వరలో బీసీలకు రక్షణ చట్టం: మంత్రి సవిత

సత్యసాయి: విజయవాడలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత నేతృత్వంలో బీసీ రక్షణ చట్టంపై శనివారం మంత్రుల సమావేశం జరిగింది. బీసీల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించేలా బీసీ రక్షణ చట్టాన్ని రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. కులం లేదా వృత్తి పేరుతో దూషించినా, సాంఘిక బహిష్కరణలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకునేలా చట్టం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

March 14, 2026 / 04:04 PM IST

అల్లు సినిమాస్ ఆఫర్‌కు ‘NO’ చెప్పిన దర్శకుడు!

HYDలోని అల్లు సినిమాస్ డాల్బీ స్క్రీన్‌లో ‘ధురంధర్ 2’ ప్రీమియర్ ప్రతిపాదనను దర్శకుడు ఆదిత్య ధర్ తిరస్కరించాడట. రూ.1000 కోట్ల వసూళ్లు సాధించిన మొదటి భాగం తర్వాత ఆయన ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నాడు. కేవలం థియేటర్ క్రేజ్ కోసం సౌత్‌లో ప్రమోట్ చేయడం అనవసరమని భావించాడట. బాలీవుడ్‌లోనూ ప్రమోషన్లకు దూరంగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్.

March 14, 2026 / 04:04 PM IST

నూతన వధూవరులను ఆశీర్వదించిన.. గ్రంథాలయ ఛైర్మన్

MLG: పట్టణ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఒజ్జల లింగయ్య కుమార్తె వివాహా మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోతు రవి చందర్ హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

March 14, 2026 / 04:03 PM IST

‘మున్సిపల్ వర్కర్స్ మహాసభలను విజయవంతం చేయాలి’

BPT: ఈ నెల 16, 17, 18వ తేదీల్లో రాజమండ్రిలో జరిగే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ పిలుపునిచ్చారు. శనివారం ఏఐటీయూసీ కార్యాలయంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు జీవో ప్రకారం మున్సిపల్ కార్మికులకు రూ. 26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

March 14, 2026 / 04:02 PM IST