• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వైద్య శిబిరాన్ని పరిశీలించిన DMHO

NGKL: కల్వకుర్తి మండలంలోని తోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ రవికుమార్ పరిశీలించారు. ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించిందన్నారు. దాదాపు 200 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారని ఆయన తెలిపారు.

March 14, 2026 / 04:02 PM IST

రూ.10 లక్షలతో సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభం

NLR: వరికుంటపాడు పామూరుపల్లిలో టీడీపీ మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు, సర్పంచ్ తెల్లగొర్ల సుశీల వెంకటయ్య రూ. 10 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను శనివారం చేపట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో మండలంలోని అన్ని గ్రామాలలో సిమెంట్ రోడ్లు నిర్మాణ పనులను చేపట్టడం జరిగింది అని ఆయన తెలిపారు.

March 14, 2026 / 04:01 PM IST

రబీ పంటకు కేఎస్ఐ నీరు: ఎమ్మెల్యే

NGKL: నియోజకవర్గ రైతులకు రబీ పంట పండేంతవరకు వాటర్ విడుదల చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. రైతులు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి రేపటి నుంచి కంటిన్యూగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పంటలు పూర్తిగా పండే వరకు నీళ్లు వదలాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

March 14, 2026 / 04:01 PM IST

‘ప్రజలు పన్నులు చెల్లిస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి’

MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రజలు సకాలంలో పన్నులు చెల్లిస్తూ పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య కోరారు. 55వ డివిజన్‌లో నిర్వహించిన ‘శుభ్రత – ప్రతి ఒక్కరి బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు సక్రమంగా జరగాలంటే ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.

March 14, 2026 / 04:00 PM IST

గాజువాక వైసీపీ పరిశీలకుడిగా పసుపులేటి బాలరాజు

ASR: వైసీపీ గాజువాక నియోజకవర్గ పరిశీలకుడిగా అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలానికి చెందిన పసుపులేటి బాలరాజును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గూడెంకాలనీ గ్రామానికి చెందిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీ బలోపేతం దృష్ట్యా ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపారు.

March 14, 2026 / 04:00 PM IST

ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన కురుపాం ఎమ్మెల్యే

PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ క్రమంలో విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆమె మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు ధైర్యంగా రాయాలని విద్యార్థినిలకు సూచించారు.

March 14, 2026 / 04:00 PM IST

ఇంటర్ మొదటి యాడాది పరీక్షకు 196 మంది గైర్హాజర్

AKP: జిల్లాలో 31 కేంద్రాల్లో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 196 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 2,031 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 1,835 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా పకడ్బందీగా ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

March 14, 2026 / 04:00 PM IST

గుండ్ల సింగారంలో కారల్ మార్క్స్ వర్ధంతి

HNK: నగరంలోని గుండ్ల సింగారం కారల్ మార్క్స్ 143వ వర్ధంతిని సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీపీఐ మండల కార్యదర్శి స్టాలిన్ మాట్లాడుతూ.. శ్రమ విలువను గుర్తించి పెట్టుబడిదారీ శ్రమ దోపిడీ వ్యవస్థ యొక్క కుట్రలను ఎత్తిచూపి ప్రపంచ గమనాన్ని మార్చిన సిద్ధాంతం మార్క్సిజమని, ఆ సిద్ధాంత రూపకర్త కారల్ మార్క్స్ అని అన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

March 14, 2026 / 04:00 PM IST

‘వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోండి’

SKLM: పోలాకి మండలం పరిషత్ కార్యాలయంలో శనివారం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తి హాజరయ్యారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలుపై చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న వేసవి కాలంలో ప్రజలకు తాగునీరు సమస్య లేకుండా తగు చర్యలు చేపట్టాలని చూడాలని అధికారులను ఆదేశించారు.

March 14, 2026 / 04:00 PM IST

ఇంటి పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలి: కమిషనర్

GNTR: తెనాలిలో మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు శనివారం పర్యటించారు. రెవెన్యూ అధికారులతో కలిసి పన్ను బకాయిదారుల నివాసాలకు వెళ్లి మాట్లాడారు. మార్చి చివరి నాటికి ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో, ఇంటి పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికి 75 శాతం వసూళ్లు పూర్తయ్యాయని, నెలాఖరు నాటికి 100% వసూళ్లు లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు.

March 14, 2026 / 04:00 PM IST

‘రైతులకు సాగునీరు అందించే బాధ్యత నాది’

JN: వచ్చే వర్షాకాలం వరకు కాలువ లైనింగ్ పనులు పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు నీరు అందించే బాధ్యత తనదాని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జఫర్‌గడ్ మండలంలోని తీగారం, హిమ్మత్ నగర్ గ్రామాల మధ్య కాలువను పరిశీలించారు. కాలువ వెంట క్షేత్రస్థాయిలో తిరుగుతూ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

March 14, 2026 / 03:59 PM IST

రాహుల్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన రాంచందర్ రావు

TG: పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ చర్యలకు బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో రాహుల్ దిష్టిబొమ్మను తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు దగ్ధం చేశారు. రాహుల్ గాంధీకి పార్లమెంట్ పిక్నిక్‌లా మారిందని విమర్శించారు. రాహుల్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.

March 14, 2026 / 03:59 PM IST

పాతబస్తీ యువత బీజేపీలో చేరిక

HYD: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పాత బస్తీకి చెందిన యువత పెద్ద ఎత్తున BJPలో చేరారు. ఈ సందర్భంగా వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అభివృద్ధి పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు, పాతబస్తీ అభివృద్ధికి నవభారత నిర్మాణానికి బీజేపీతో కలిసి నడుస్తామని యువత పేర్కొన్నారు.

March 14, 2026 / 03:58 PM IST

‘జిల్లా వ్యాప్తంగా 37 మంది గైర్హాజరు’

NLG: జిల్లాలోని 106 పరీక్ష కేంద్రాల్లో పదవ తరగతి తెలుగు పరీక్ష సుజావుగా జరిగినట్లు డీఈవో బిక్షపతి తెలిపారు. మొత్తం 19,672 మంది విద్యార్థులకు గాను 19,635 మంది విద్యార్థులు పరీక్ష వ్రాసినట్లు తెలిపారు. 37 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. నాలుగు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ చంద్రశేఖర్ సందర్శించారని పేర్కొన్నారు.

March 14, 2026 / 03:56 PM IST

కుషాయిగూడ డిపో నుంచి కాశీ యాత్రకు ప్రత్యేక బస్సు

MDCL: TSRTC కుషాయిగూడ డిపో నుంచి కాశీ యాత్రకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. ఈ బస్సు మార్చి 28 సాయంత్రం 6 గంటలకు ఈసీఐఎల్ బస్టాండ్ నుంచి బయలుదేరి ఉజ్జయిని, ఓంకారేశ్వర్, అయోధ్య, ప్రయాగ్‌రాజ్, కాశీ క్షేత్రాలను సందర్శిస్తుందన్నారు. టికెట్ ధర రూ. 8,000 ఉందని తెలిపారు. బుకింగ్ కోసం 9959226145, 9603549388 సంప్రదించాలి పేర్కొన్నారు.

March 14, 2026 / 03:56 PM IST