• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రైతుబంధు అందుకున్న తొలి రైతు మృతి

KNR: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 2018 మే 10న రైతుబంధు తొలి చెకును అందుకున్న రైతు మూగల సంజీవరెడ్డి(94) మరణించారు. హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన ఆయన ధర్మరాజుపల్లి ధాన్య విత్తన సంఘం, రైతుసేవా పురుషుల పొదుపు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా, అదేవిధంగా గ్రామ తొలి సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

March 19, 2026 / 02:35 PM IST

మల్లు స్వరాజ్యంకు జోహార్లు అర్పించిన నేతలు

NLG: నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయడంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కీలక పాత్ర పోషించారని సీపీఎం నేతలు ప్రశంసించారు. గడీలపై దాడులు చేసి ధాన్యాన్ని పేదలకు పంచడం వంటి ధైర్య సాహసాలను కొనియాడారు. చిట్యాలలో గురువారం ఆమె వర్ధంతి కార్యక్రమంలో నేతలు జోహార్లు అర్పించారు.

March 19, 2026 / 02:33 PM IST

BLR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా MLA దుస్తుల పంపిణీ

HYD: రంజాన్ మాసం సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి BLR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ముస్లిం పెద్దలు, ఇమామ్‌లు, మోజంలకు బట్టలు పంపిణీ చేశారు. పేదలకు, అర్హులైన కుటుంబాలకు సాయం చేయడం తమ బాధ్యతని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్, మైనారిటీ నాయకులు బద్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

March 19, 2026 / 02:31 PM IST

భార్యపై భర్త గొడ్డలితో దాడి

MHBD: భార్యపై ఓ భర్త గొడ్డలితో దాడి చేసిన ఘటన గురువారం కంబాలపల్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన విజయ, నరేష్‌లు భార్యభర్తలు కాగా కుటుంబకలహాల నేపథ్యంలో నరేష్ విజయపై గొడ్డలితో దాడిచేశాడు. ఈ ఘటనలో విజయకు తీవ్రగాయాలు కాగా స్థానికులు 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విజయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

March 19, 2026 / 02:31 PM IST

ఈదురుగాలులకు నేలకొరిగిన మొక్కజొన్న పంట

ATP: పెద్దపప్పూరు మండలం షేక్ పల్లి గ్రామంలో యువ రైతు లోకేశ్ రెడ్డికి చెందిన 3 ఎకరాల మొక్కజొన్న పంట బుధవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షానికి నేలవాలింది. 20 రోజుల్లో పంట చేతికొస్తుందని ఎంతో ఆశించిన ఆ రైతుకు అకాల వర్షం శాపంగా మారింది. గురువారం వ్యవసాయ అధికారులు నేలవాలిన మొక్కజొన్న పంటను పరిశీలించారు.

March 19, 2026 / 02:30 PM IST

ఎమ్మెల్యే సహకారంతో తీరిన ‘విద్యుత్’ కష్టాలు

NRPT: దామరగిద్ద మండలంలోని మల్ రెడ్డిపల్లి గ్రామంలో నెలకొన్న లో-వోల్టేజ్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గురువారం సర్పంచ్ శ్వేత ఆధ్వర్యంలో గ్రామస్థులు ఈ సమస్యను ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఆదేశాలతో రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించారు.

March 19, 2026 / 02:30 PM IST

‘ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా విద్యుత్ మీటర్లు ఇవ్వాలి’

JGL: ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ మీటర్లు ఇవ్వాలని కోరుతూ రాయికల్ పట్టణ వార్డు సభ్యులు భూస గంగ మల్లయ్య, అనుమల్ల రమ రాయికల్ విద్యుత్ ఏఈ నవీన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఇంటి నిర్మాణాలు పూర్తి కావస్తున్నందున, లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ స్తంభాలు వేసి కనెక్షన్లు ఇవ్వాలని కోరారు.

March 19, 2026 / 02:29 PM IST

కదిలి ఆలయంలో ఉగాది వేడుకలు

NRML: దిలావర్పూర్ మండలంలోని ప్రసిద్ధ శ్రీ మాతా అన్నపూర్ణ పాపహరేశ్వర ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ వెంకట్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమానికి గ్రామస్థులు పోటెత్తారు. వేద పండితులు వినిపించిన నూతన సంవత్సర ఫలితాలను భక్తులు ఆసక్తిగా విన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

March 19, 2026 / 02:28 PM IST

మార్కెట్‌లో శనగలు క్వింటా ధర ఇలా.!

KMR: డోంగ్లీ, మద్నూర్ మండలాల్లోని మార్కెట్‌లో శనగలు ప్రస్తుతం క్వింటాకు రూ.5,250 ధర పలుకుతోందని వ్యాపారులు తెలిపారు. 2 రోజుల్లో క్వింటాకు రూ.50 పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం త్వరలోనే ప్రారంభం కానుంది. రైతులు కొనుగోలు ఈ కేంద్రం ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రైవేటులో కంటే ప్రభుత్వ ధర క్వింటాకు రూ.600 వరకు ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు.

March 19, 2026 / 02:28 PM IST

కుక్కల బీభత్సం.. 20 మేకలు మృతి

W.G: మొగల్తూరు మండలం కేపీ.పాలెంలో వీధి కుక్కలు దాడి చేయడంతో 20 మేకలు ప్రాణాలు కోల్పోయాయి. రైతు కొండేటి చినబాబుకు చెందిన మేకల దొడ్డిలోకి ఇవాళ తెల్లవారుజామున కుక్కలు చొరబడి విచక్షణారహితంగా కరిచి చంపేశాయని స్థానికులు తెలిపారు. మృతి చెందిన మేకల విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని బాధితుడు వాపోయాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని సదరు రైతు కోరుతున్నాడు.

March 19, 2026 / 02:27 PM IST

‘మత సామరస్యంతో పండుగలు జరుపుకుందాం’

NDL: రంజాన్, ఉగాది పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మంత్రి ఫరూక్ గురువారం పిలుపునిచ్చారు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యాన్ని పాటిస్తూ.. గొడవలకు దూరంగా ఉండి కుటుంబాలతో ఆనందంగా పండుగలు జరుపుకోవాలని మంత్రి సూచించారు.

March 19, 2026 / 02:24 PM IST

4 గ్రామాలకు ఎంపీ నిధులు మంజూరు

NRPT: ధన్వాడ మండలంలోని ధన్వాడ, మంత్రోనిపల్లి, కంసాన్ పల్లి, కిష్టాపూర్ గ్రామాలకు ఎంపీ నిధుల నుంచి రూ. 25 లక్షలు మంజూరయ్యాయని సర్పంచులు జ్యోతి రామచంద్రయ్య, రవికుమార్, కొండయ్య గురువారం వెల్లడించారు. మంజూరైన నిధులతో గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణకు కృతజ్ఞతలు తెలిపారు.

March 19, 2026 / 02:22 PM IST

దేశంలోనే తొలి ‘LPG ATM’ ప్రారంభం

యుద్ధ మేఘాల వల్ల దేశంలో LPG సరఫరాపై అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. హర్యానాలోని గురుగ్రామ్ (సోహనా, సెక్టార్-33)లో పైలట్ ప్రాజెక్టుగా దేశంలోనే తొలిసారిగా LPG ATMను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్ వారంలో ఏడు రోజులు, 24 గంటల పాటు పనిచేస్తుంది.

March 19, 2026 / 02:22 PM IST

పేదలకు అన్నదానం పంపిణి

TPT: గూడూరు పట్టణంలోని నెల్లటూరు కట్ట కింద గిరిజన కాలనీలో పేదలకు కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. రంజాన్ పండగ పురస్కరించుకుని దాతలు షేక్ బాషా, బషీర దంపతులు, వారి కుమార్తె షేక్ పర్వీన్ సహకారంతో సుమారు 50 కుటుంబాలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

March 19, 2026 / 02:21 PM IST

గంగమ్మ తల్లికి మంగళహారతులు..!

SDPT: చిన్నకోడూరులోని గంగమ్మతల్లికి 24వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మంగళ హారతులు సమర్పించనున్నట్లు గంగపుత్ర సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, అమ్మవారికి అభిషేకం, భక్తులకు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు.

March 19, 2026 / 02:20 PM IST