KMR: డోంగ్లీ, మద్నూర్ మండలాల్లోని మార్కెట్లో శనగలు ప్రస్తుతం క్వింటాకు రూ.5,250 ధర పలుకుతోందని వ్యాపారులు తెలిపారు. 2 రోజుల్లో క్వింటాకు రూ.50 పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం త్వరలోనే ప్రారంభం కానుంది. రైతులు కొనుగోలు ఈ కేంద్రం ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రైవేటులో కంటే ప్రభుత్వ ధర క్వింటాకు రూ.600 వరకు ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు.