VSP: గోపాలపట్నం రైతు బజార్లో ఓ రైతు తన నిజాయితీని చాటుకున్నాడు. బజార్‌కు వచ్చిన వినియోగదారుడు శ్రీనివాసరావు తన మొబైల్ ఫోన్‌ను ఓ స్టాల్ వద్ద మర్చిపోయి వెళ్లిపోయాడు. దీనిని గమనించిన అక్కడి రైతు నిజాయితీగా ఫోన్‌ను ఎస్టేట్ అధికారికి అందజేశాడు. ఇంటికి వెళ్లాక ఫోన్ మిస్సైన విషయం గుర్తించి తిరిగి బజార్‌కు రాగా అధికారులు అతనికి ఫోన్ అప్పగించారు.