TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈనెల 20 తర్వాత బీఆర్ఎస్లో చేరనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. కాగా ఇటీవల పార్టీలో తనకు సరైన గుర్తింపు ఉండటం లేదని జీవన్ రెడ్డే స్వయంగా పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.