KRNL: ఆదోని నియోజకవర్గంలో వంట గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గ్యాస్ ఏజెన్సీలకు సూచించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఏజెన్సీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యుద్ధం పేరుతో కొందరు వదంతులు సృష్టించి కృత్రిమ కొరతకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా కొనసాగించాలని ఆదేశించారు.