GDWL: వేసవిలో ప్రజలు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే స్వగ్రామం పుల్లూరులో గ్రామస్థులతో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అనవసరంగా బయట తిరగవద్దని సూచించారు. రైతులు ఉదయం వేళలో వ్యవసాయ పనులు ముగించుకోవాలన్నారు.