TG: కవితకు దొరల అహంకారం.. దొరల పోకడ పోలేదని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విమర్శించారు. రాజకీయ పబ్బం కోసం కొత్త దుకాణం పెట్టారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న ప్రతి రూపాయి.. ఇప్పుడు ఎన్నికల కోసం ఖర్చు పెడుతోందన్నారు. రాష్ట్రంలో కవిత పార్టీ పరిస్థితి ఏంటో త్వరలోనే ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు.