నాగర్కర్నూల్ జిల్లాలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు జారీ చేయాలని టీడబ్ల్యూజెఎఫ్ యూనియన్ జిల్లా నాయకులు డీపీఆర్వో కిరణ్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఎలాంటి షరతులు లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ సమాన గుర్తింపు ఇవ్వాలని కోరారు. నల్లమల్ల ప్రాంత జర్నలిస్టులకు కూడా కార్డులు ఇవ్వాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.