E.G: వైద్య వృత్తి కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదని, అది మానవతావాదంతో కూడిన పవిత్రమైన సేవ అని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం నిడదవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మంత్రి అక్కడ నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొని వైద్యులు, సిబ్బందితో చర్చించారు. వైద్యులు విధి నిర్వహణలో మానవతా దృక్పథాన్ని చాటుకోవాలన్నారు.