ప్రకాశం: కనిగిరి మండలంలోని బడుగులేరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధన విధానం, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా కృషి చేయాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.