ఫ్రెంచ్ భాషలో ‘గ్రాండ్ ప్రిక్స్’ అంటే ‘గొప్ప బహుమతి’ అని అర్థం. ఇది క్రీడా పోటీలలో అత్యున్నత స్థాయిని సూచిస్తుంది. 1906లో ఫ్రాన్స్‌లో జరిగిన రేసుతో ఈ పదం మోటార్ స్పోర్ట్స్‌లో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం F1 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నిర్వహించే ప్రతి వ్యక్తిగత రేసును ‘గ్రాండ్ ప్రిక్స్’ అని పిలుస్తారు. రేసింగ్ ప్రపంచంలో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవం.