• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నూతన విద్యుత్ లైన్ పనులను ప్రారంభించిన సర్పంచ్

MHBD: కురవి మండలం బలపాల గ్రామంలో నూతన విద్యుత్ లైన్ పనులను శనివారం గ్రామ సర్పంచ్ బిక్కు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ నుంచి వైకుంఠధామం వరకు ఈ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు రాత్రి వేళల్లో ఇబ్బంది కలగకుండా ప్రతి స్తంభానికి విద్యుత్ లైట్లను అమర్చుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు ఉన్నారు.

March 14, 2026 / 04:33 PM IST

ఈ నెల 18న పశువుల సంత వేలం

NGKL: ఈనెల 18న కల్వకుర్తి పశువుల సంత వేలం వేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ షేక్ మహమూద్ తెలిపారు. పశువుల సంతతో పాటు తై బజార్, వధశాలకు వేలంపాట నిర్వహిస్తామని పేర్కొన్నారు. వేలం పాటలో పాల్గొనే వారు డిపాజిట్ చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. పశువుల సంతకు రూ.10 లక్షలు, తై బజార్‌‌కు రెండు లక్షలు, వధశాలకు రూ.20,000 డిపాజిట్ చెల్లించాలని కోరారు.

March 14, 2026 / 04:33 PM IST

RGUKTలో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల

MBNR: మహబూబ్ నగర్ ట్రిపుల్ ఐటీలో 2026 -27 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఇంఛార్జ్ వీసీ గోవర్దన్ వెల్లడించారు. 18వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమై, ఏప్రిల్ 10 వరకు కొనసాగుతాయన్నారు. కాగా, మే 20, 30 తేదీల్లో ఎంపిక జాబితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.

March 14, 2026 / 04:33 PM IST

సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్

JN: కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పంటలకు సాగునీరు, నిరంతర విద్యుత్ అందేలా చూడాలని, రైతులకు ఇబ్బందులు రాకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఏవో అంబికా సోనీ, ఎస్‌ఈలు సీతారాం, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

March 14, 2026 / 04:32 PM IST

స్కూల్ ఫుడ్ క్వాలిటీపై ఎమ్మెల్యే సంతృప్తి

W.G: తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. స్వయంగా ఆహారాన్ని రుచి చూసిన ఆయన.. భోజన నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల పౌష్టికాహారం పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు పాల్గొన్నారు.

March 14, 2026 / 04:32 PM IST

మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి: లక్ష్మీపార్వతి

AP: రాష్ట్రంలో మంత్రులపై జరుగుతున్న దారుణాలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తాడేపల్లిలో ఆమె మాట్లాడుతూ.. ‘కూటమి అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని చెప్పారు. మహిళలపై ఎమ్మెల్యేలే అత్యాచారాలు చేస్తున్నారంటూ విమర్శించారు. పాపాలను పంచుకోవడంలో జనసేన కూడా భాగం పంచుకుంటోంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 14, 2026 / 04:31 PM IST

జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్లకు ప్రమోషన్లు..!

కడప: జిల్లాలో 8 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్‌లుగా తాత్కాలిక ప్రమోషన్లు కల్పిస్తూ.. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఆరుగురికి నందలూరు, చెన్నూరు, కడప అర్బన్, టి. సుండుపల్లి, మైలవరం, బి. కోడూరుల్లో పోస్టింగ్ ఇవ్వగా, ఒకరిని అన్నమయ్య జిల్లాకు కేటాయించారు. మరొకరి స్థానం ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

March 14, 2026 / 04:31 PM IST

మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిదిద్దేందుకు రూ.32.80 కోట్లు

AKP: నక్కపల్లిలో 50 పడకల సీహెచ్సీని వంద పడకలుగా అప్ గ్రేడ్ చేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిదిద్దడానికి రూ.32.80 కోట్లు మంజూరైనట్లు హోంమంత్రి అనిత తెలిపారు. నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో శనివారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. కోటవురట్ల మండలం ఇందేశమ్మ ఘాట్ రోడ్డులో కొండను తొలచి రహదారి విస్తరణకు రూ.16 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.

March 14, 2026 / 04:30 PM IST

ఈ నెల 16న ప్రజావాణి రద్దు: కలెక్టర్

GDWL: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీన రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16 నుంచి 18 వరకు గద్వాల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జనాభా గణన అంశంపై జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

March 14, 2026 / 04:30 PM IST

జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

VSP: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పరీక్షలను 133 కేంద్రాల్లో 28,983 మంది విద్యార్థులు రాయనున్నారన్నారు. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు.

March 14, 2026 / 04:30 PM IST

తాగునీటి పైప్‌లైన్‌లకు మరమ్మతులు

VKB: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పరిగి, 12వ వార్డు అయ్యప్ప కాలనీలో తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. కౌన్సిలర్ వారాల రవీంద్ర ఆధ్వర్యంలో మంచినీటి పైప్‌లైన్‌లకు మరమ్మతులు చేయించారు. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ ప్రజలకు నీటి ఎద్దడి రాకుండా వార్డు మొత్తం పర్యవేక్షిస్తూ లీకేజీలను అరికడుతున్నట్లు కౌన్సిలర్ తెలిపారు.

March 14, 2026 / 04:30 PM IST

ఆరెంజ్ క్యాప్ ఎక్కువసార్లు గెలిచింది వీరే!

ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఏకైక ఆటగాడిగా డేవిడ్ వార్నర్ రికార్డు సృష్టించాడు. SRH తరఫున ఆడుతూ 2015, 2017, 2019 సీజన్లలో వార్నర్ ఈ ఘనత సాధించాడు. RCB తరఫున క్రిస్ గేల్ 2011, 2012 సీజన్లలో వరుసగా 2 సార్లు ఈ అవార్డును గెలుచుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. అదేవిధంగా, కోహ్లీ కూడా 2016, 2024 సీజన్లలో ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు.

March 14, 2026 / 04:30 PM IST

వేసవిలో కరెంటు కోతలు ఉండొద్దు: ఎమ్మెల్యే

RR: ఎండకాలంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారులను ఆదేశించారు. షాద్‌నగర్ విద్యుత్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. విద్యుత్ కొరతతో పంటలు ఎండిపోకూడదని, తాగునీరు, సాగునీటికి ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు.

March 14, 2026 / 04:29 PM IST

మచ్చ బొల్లారంలో రంజాన్ తోఫా కిట్ల పంపిణీ

MDCL: అల్వాల్ సర్కిల్ తుర్కపల్లి, బొల్లారంలోని జామా మసీదులో అర్హులైన లబ్ధిదారులకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.

March 14, 2026 / 04:28 PM IST

‘అవినీతి జరిగిందని ఆధారాలతో నిరూపించాలి’

MNCL: అధికార పార్టీపై బురదజల్లడం అలవాటుగా మారిందని MLA వినోద్ శనివారం ప్రకటనలో మండిపడ్డారు.ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వారు, దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు, PA లపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలుగా మాట్లాడటం సరికాదన్నారు.

March 14, 2026 / 04:27 PM IST