ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఏకైక ఆటగాడిగా డేవిడ్ వార్నర్ రికార్డు సృష్టించాడు. SRH తరఫున ఆడుతూ 2015, 2017, 2019 సీజన్లలో వార్నర్ ఈ ఘనత సాధించాడు. RCB తరఫున క్రిస్ గేల్ 2011, 2012 సీజన్లలో వరుసగా 2 సార్లు ఈ అవార్డును గెలుచుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. అదేవిధంగా, కోహ్లీ కూడా 2016, 2024 సీజన్లలో ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు.