కృష్ణా: పెడన మండలం చేవెండ్ర గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి, మిగిలిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.