VZM: జిల్లాలో గ్యాస్ కొరతపై ఏపీ హోటల్ అసోసియేషన్ సభ్యులు ఇవాళ ఓ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా అసోసియేషన్ అధ్యక్షుడు జి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. లక్షల మందికి ఉపాధి దూరమవుతుందన్నారు.. గ్యాస్ బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.