గోటీల వ్యాపారంతో నటుడు రాజశేఖర్ రూ.3 కోట్లు-4 కోట్లు సంపాదిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై రాజశేఖర్ స్పందించాడు. అందులో నిజం లేదని, తనకు గోటీల ఫ్యాక్టరీ లాంటిది లేదని స్పష్టం చేశాడు. అలాంటి ఆలోచన కూడా లేదని, ఎవరో కావాలని క్రియేట్ చేశారని చెప్పాడు. ముఖ్యంగా వార్తలను చూసి నవ్వుకున్నానని తెలిపాడు.