NTR: విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి సౌత్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల వరకు నైట్ పెట్రోలింగ్ కోసం 8 ద్విచక్ర వాహనాలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు నిన్న అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ కృష్ణకాంత్, ఏడీసీపీ మురళీకృష్ణ, సౌత్ డివిజన్ ఇన్ఛార్జ్ లతా కుమారి, కృష్ణలంక ఎస్సై నాగరాజు తదితరులు పాల్గొన్నారు.