KMM: వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ను అధికారులు శనివారం విడుదల చేశారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. రూ. 50 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 9 వరకు గడువు ఉందని చెప్పారు.