BPT: రేపల్లెలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం కీలక సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు హాజరయ్యారు. గ్రామీణ స్థాయిలో ప్రతి గడపకూ కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ఎలా తీసుకెళ్లాలో నేతలు వివరించారు. స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునే మార్గాలపై ప్రజలకు దిశానిర్దేశం చేశారు.
ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు కొత్త కోర్సులు ప్రారంభం కానున్నాయి. BSC హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్, B.Com (BFSI) కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి కోర్సులో 60 సీట్లు కేటాయించినట్లు ప్రిన్సిపల్ మల్లేశం తెలిపారు. ఇంటర్ అర్హతతో ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కమిషనరేట్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు అమలు చేస్తున్నారు.
GDWL: రైతులు సేంద్రియ సాగుపై దృష్టి సారించి అధిక ఆదాయం పొందాలని శాస్త్రవేత్తలు డాక్టర్ సదయ్య, డాక్టర్ మారుతి సూచించారు. అయిజ మండలం ఎక్లాస్‌పూర్ రైతు వేదికలో ‘రైతు ముంగిట్‌లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించారు. పంట మార్పిడి విధానాన్ని పాటించాలని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగన్న, ఏఈవో జయన్న పాల్గొన్నారు.
NZB: భీమగల్ మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్డీ) గా బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్‌ను బుధవారం మీ సేవ కేంద్రాల యూనియన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు మీ సేవ ద్వారా అందుతున్న సేవలను మరింత వేగవంతం చేయాలని ఎంఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ అజీజ్, వైస్ ప్రెసిడెంట్ బొమ్మెన సునీల్ తదితరులు పాల్గొన్నారు.
MLG: పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. జిల్లా 99.30 శాతం ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో మొత్తం ఉత్తీర్ణత 95.15 శాతం నమోదు కాగా, బాలికలు ముందంజలో ఉన్నారని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులను అభినందించారు.
ప్రపంచ మార్కెట్‌లో ఎంత చమురు విక్రయించాలో నిర్ణయించడానికి ఒపెక్ సభ్య దేశాలు క్రమం తప్పకుండా సమావేశమవుతాయి. ఈ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలను బట్టే ధరలు మారుతుంటాయి. డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు ఉత్పత్తిని తగ్గించి ధరలు పెంచుతారు. సరఫరా పెంచితే ధరలు తగ్గుతాయి. ఇలా ఈ దేశాల ఉమ్మడి నిర్ణయాలే అంతర్జాతీయ చమురు ధరలను శాసిస్తాయి.
SRL: ఇల్లంతకుంట మండలం అనంతగిరిలో ఉన్న పోచమ్మ దేవాలయాన్ని బుధవారం సందర్శించి పోచమ్మ దేవతను దర్శించుకున్నారు. అనంతరం అన్నపూర్ణ రిజర్వాయర్‌ను ఆమె సందర్శించారు. రిజర్వాయర్ సామర్థ్యం తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.
SRL: ఇల్లంతకుంట మండలం అనంతగిరిలో ఉన్న పోచమ్మ దేవాలయాన్ని బుధవారం సందర్శించి పోచమ్మ దేవతను దర్శించుకున్నారు. అనంతరం అన్నపూర్ణ రిజర్వాయర్‌ను ఆమె సందర్శించారు. రిజర్వాయర్ సామర్థ్యం తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.
ఏలూరు జిల్లా హోంగార్డు యూనిట్‌లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన ఎం.వీరబాబు కుటుంబానికి పోలీసులు అండగా నిలిచారు. ఇవాళ ఎస్పీ కార్యాలయంలో ప్రభుత్వ జనరల్ ఇన్సూరెన్స్ (PGI) కింద మంజూరైన రూ.11,40,000 భీమా చెక్కును వీరబాబు భార్య రామలక్ష్మి దేవికి ఎస్పీ ప్రతాప్ కిషోర్ అందజేశారు. వీరబాబు మరణం హోంగార్డు విభాగానికి తీరని నష్టమన్నారు.
SRPT: కోదాడ మండల శివారులో జాతీయ రహదారిపై అతివేగంతో అదుపుతప్పి కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీపంలోని నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, ప్రథమ చికిత్స అందించారు. సమాచారం అందుకున్న నేలకొండపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
KDP: ఒంటిమిట్టలోని పెట్రోలు బంకును ఇవాళ RDO మురళి తనిఖీ చేసి స్టాకు రిజిస్టర్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు డీజిల్, పెట్రోలు కొరత లేకుండా చూడాలన్నారు. వాటర్ బాటిల్, క్యాన్లలో పెట్రోలు,డీజిల్ పట్టకూడదని నిర్వాహకులను ఆదేశించారు. ఇంధనం బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తప్పవన్నారు.
VKB: పదో తరగతి ఫలితాల నేపథ్యంలో తల్లిదండ్రులు సంయమనంతో వ్యవహరించాలని కోట్‌పల్లి ఎస్సై శైలజ తల్లిదండ్రులకు సూచించారు. ఫలితం ఏదైనా సరే పిల్లలను మందలించకుండా ప్రేమతో ప్రోత్సహించాలని, ఇతరులతో పోల్చవద్దని పేర్కొన్నారు. ఆశించిన ఫలితాలు రాకపోతే నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించేలా కుటుంబ సభ్యులు అండగా ఉండాలని ఆమె కోరారు.
NRML: ఖానాపూర్ మండలంలో బొడ్డు గంగన్న ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ, మున్సిపల్ కౌన్సిలర్లు రాజుర సత్యం, రమేష్, కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ, చలివేంద్రాలను నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ MLA బొజ్జు ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. ఎండల నుంచి ప్రజల ఉపశమనం కొరకు సామాజిక బాధ్యతతో అంబలి పంపిణీ, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షణీయం అన్నారు.
MHBD: తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ పనుల్లో కేంద్రం ప్రవేశపెట్టిన ఫేషియల్ అటెండెన్స్ (ముఖ ఆధారిత హాజరు) విధానంతో కూలీలు నరకం చూస్తున్నారు. ఫేస్ రికగ్నజేషన్ యాపులో ఫోటో తీసిన తర్వాత ఏర్పడే సర్వర్ సమస్యల వలన కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కొత్త విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
TG: నూతన డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్.. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపుర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈ నెల 30న ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవీకాలం ముగుస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం సీవీ ఆనంద్‌ను డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.