సంగారెడ్డి జిల్లాలోని 233 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం నిధులు విడుదల చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఒక్కో పాఠశాలకు రూ. 2 లక్షల చొప్పున మొత్తం రూ. 4.66 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను పాఠశాల భవనాల్లోని అత్యవసర మరమ్మతుల కోసం మాత్రమే వినియోగించాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.