JN: రఘునాథపల్లి మండల కేంద్రంలో అనుమతి లేకుండా వైద్య సేవలు అందిస్తూ ఆసుపత్రి నిర్వహిస్తున్న ఇద్దరు ఆర్ఎంపీలు చింతకింది సత్యనారాయణ, అరుణ్ కుమార్‌పై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమంగా వైద్య సేవలు అందించడం, ఆసుపత్రి నిర్వహణ చేయడం వంటి ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు. అర్హతలు లేకుండా వైద్య సేవలు అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.