TPT: శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం పుష్పయాగం నిర్వహించనున్నారు. ఉదయం స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పుష్పయాగం జరుగుతుంది.సేవలో పాల్గొనడానికి రూ. 516 టికెట్ ఏర్పాటు చేశారు. ఇవాళ ఆలయంలో టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. రేపు నిత్య కళ్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.