TPT: తిరుపతి SV యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ క్యార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్లో ఈ నెల 16న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆరు కంపెనీల ప్రతినిధులు హాజరై ఉద్యోగార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. మొత్తం 650 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.