AP: ‘వెన్నుపోటు, వంచన, మోసం వంటి దుర్గుణాలే ఆసరాగా బతుకుతున్న ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు’ అంటూ YCP తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తానని ఎన్నికల హామీ ఇచ్చారని, ఎక్కడిచ్చావు? ఎప్పుడిస్తావు? అంటూ నిలదీసింది. తొలి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టారని, రెండో ఏడాది రూ.10 వేలతో సరిపెట్టారని.. అందులోనూ లక్షల మందికి కోత పెట్టారని విమర్శించింది.