SRCL: ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్లలోని 10వ తరగతి పరీక్ష కేంద్రాలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.