TG: ఇవాళ మూసీ నది బ్యూటిఫికేషన్, పునరుజ్జీవంపై మాజీ మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరికీ నష్టం కలగకుండా, ఇళ్లను కూలగొట్టకుండా మూసీ నది ప్రక్షాళన, అభివృద్ధి కోసం చేపట్టిన ప్రణాళికలపై వివరణ ఇవ్వనున్నారు. మూసీ బాధితులకు భరోసా కల్పిస్తూ, వారికి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.