• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితిక పంత్ ఫిర్యాదుదారుల నుంచి ఆర్జీలు స్వికరించారు. సమస్యలను స్వయంగా విని, చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు.

April 27, 2026 / 07:04 PM IST

ధాన్యపు కొనుగోలు కేంద్రం ప్రారంభం

KNR: గంగాధర మండలంలోని లింగంపల్లిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని సోమవారం తహశీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో దమ్మని రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.

April 27, 2026 / 07:04 PM IST

పాలమూరు వర్సిటీ రూరల్ క్యాంప్ ప్రారంభం

MBNR: పాలమూరు యూనివర్సిటీ MSW విద్యార్థుల రూరల్ క్యాంప్‌ను వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణయ్య ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని బాల్య వివాహాలు, మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించాలని ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ సమస్యలపై చైతన్యం తీసుకురావడమే ఈ క్యాంప్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 

April 27, 2026 / 07:04 PM IST

‘సూపర్ సమ్మర్ క్యాంపు వినియోగించుకోవాలి’

PDPL: విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సూపర్ సమ్మర్ క్యాంప్ వినియోగించుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. మంథనిలో ఈనెల 25 నుంచి మే 2, RGM: మే 3 నుంచి 9, PDPL: మే 10 నుంచి 16, సుల్తానాబాద్: మే 17 నుంచి 23 వరకు కంప్యూటర్, ఏఐ, రోబోటిక్స్‌పై ప్రత్యేక శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. మే 26న కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

April 27, 2026 / 07:03 PM IST

ఇండస్ట్రియల్ గైడెన్స్ అండ్ కన్సల్టేషన్ సెంటర్‌ పరిశీలన

జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ గైడెన్స్ అండ్ కన్సల్టేషన్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం పరిశీలించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్న యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని విధాల సహకారం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇండస్ట్రియల్ గైడెన్స్ సెంటర్ ద్వారా ఒకే చోట అన్ని సేవలు అందిస్తారన్నారు.

April 27, 2026 / 07:03 PM IST

సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో పులిహార పంపిణీ

KMR: సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు ప్రజావాణి కార్యక్రమానికి తరలివచ్చే వారి కోసం సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో పులిహోర వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. NZB కలెక్టరేట్‌లో నేడు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా పులిహోర పంపిణీ చేశారు. వేసవి ఎండలు తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ప్రజావాణికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అందజేశారు.

April 27, 2026 / 07:02 PM IST

ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు 57 ఫిర్యాదులు

ప్రకాశం: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీకి 57 అర్జీలు వచ్చినట్లుగా ఎస్పీ కార్యాలయం నిర్వహణ అధికారులు వెల్లడించారు. వచ్చిన అర్జీలు అన్నిటిని పరిశీలించి పరిష్కరిస్తామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు.

April 27, 2026 / 07:02 PM IST

నూతన SIగా బాధ్యతలు స్వీకరన

MHBD: డోర్నకల్ పోలీస్ స్టేషన్‌ నూతన SIగా ఝాన్సీ బాయి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది SIకు ఘన స్వాగతం పలికారు. అనంతరం SI ఝాన్సీ బాయి మాట్లాడుతూ..శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. స్టేషన్ పరిధిలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

April 27, 2026 / 07:02 PM IST

ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

NGKL: జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 33 వినతులను స్వీకరించారు. సమస్యలను జాప్యం లేకుండా, ప్రాధాన్యం క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు జవాబుదారీతనంతో సేవలు అందిస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు.

April 27, 2026 / 07:02 PM IST

​యువతకు వరం ‘పీఎం ఇంటర్న్‌షిప్’: కలెక్టర్

MDK: నిరుద్యోగ యువతకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ‘పీఎం ఇంటర్న్‌షిప్’ పథకం ప్రవేశపెట్టినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో పోస్టర్లను ఆవిష్కరించారు. 18-25 ఏళ్ల లోపు వారు అర్హులని, ఎంపికైన వారికి నెలకు రూ.5వేల వేతనంతో పాటు రూ.6వేల అదనపు సాయం అందుతుందన్నారు. ఆసక్తి గల వారు వెంటనే అధికారిక పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

April 27, 2026 / 07:02 PM IST

జిల్లా మహిళా పీఎంపీ, ఆర్ఎంపీ వెల్ఫేర్ కార్యవర్గం ఎన్నిక

కామారెడ్డి జిల్లా పీఎంపీ, ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా మహిళా విభాగం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆర్ఎంఈ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నిజ్జన విఠల్ వివరాలు వెల్లడించారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా సూర సునీత, ప్రధాన కార్యదర్శిగా రాథోడ్ రుక్మిణి, గౌరవాధ్యక్షురాలిగా చామరం విమల, ఉపాధ్యక్షురాలిగా వడ్ల సుజాత ఉన్నారు.

April 27, 2026 / 07:01 PM IST

‘మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టింది’

NLG: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కుట్రలు, కుతంత్రాలతోనే మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టిందని, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఈరోజు నల్లగొండ పట్టణంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశాలో ఆయన పాల్గొని మాట్లాడారు.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు.

April 27, 2026 / 07:01 PM IST

త్వరితగతిన న్యాయం అందించాలి: ఎస్పీ

జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పలు ఫిర్యాదులను పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

April 27, 2026 / 07:01 PM IST

క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

BPT: ఐపీఎల్ సీజన్ వేళ అక్రమంగా క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ముఠాపై బాపట్ల జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు మొత్తం 42 మందిని అరెస్ట్ చేశారు. ఒక కారు, ఒక బైక్, 25 మొబైల్ ఫోన్లు, రూ. 51,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్పీ చెప్పారు.

April 27, 2026 / 07:01 PM IST

ఘనంగా బీరప్ప స్వామి కల్యాణోత్సవం

SDPT: కుకునూరుపల్లి మండల కేంద్రంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో కురుమ కుల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప స్వామి, కామరాతి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కురుమ సంఘం సభ్యులు మాట్లాడుతూ.. బీరప్ప స్వామి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.

April 27, 2026 / 07:00 PM IST