తెలంగాణ భూమి పుత్రుల జాగీరే.. 4 కోట్ల మంది ప్రజల జాగీర్ అని KTR కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పవన్ కళ్యాణ్‌ను పోటీ చేయొద్దని ఎవరన్నారు.. ఎవరు అడ్డుకున్నారు. 2018, 2023లో జనసేన పోటీ చేయలేదా? తెలంగాణ వస్తే 11 రోజులు తినలేదన్నారు.. మరోసారి తెలంగాణకు వ్యతిరేకం కాదంటారు. దేశభక్తి గురించి పవన్ మాకు నేర్పించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.
BDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పినపాక మండల అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు తమ వంతుగా అడవి సంరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. భవిష్యత్తు తరాలు సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.
CTR: ఒడిశాకు చెందిన గంజాయి స్మగ్లర్లను చిత్తూరులో అరెస్ట్ చేసినట్లు ఏఆర్ ఎస్పీ రాజశేఖర్ రాజు, డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు. వెస్ట్ సీఐ శ్రీధర్ నాయుడు, యాదమరి ఎస్సై ఈశ్వరయ్య సిబ్బందితో కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద దాదాపు 39.7 కేజీల గంజాయిని, 2 మొబైల్ ఫోన్లు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.
కృత్రిమ మేధ(AI) విప్లవం కారణంగా డేటా సెంటర్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా సైబర్ భద్రతా నిపుణులకు ఐటీ కంపెనీలు భారీ ప్యాకేజీలతో ఆఫర్లు ఇస్తున్నాయి. కొన్ని కీలక పాత్రల కోసం $1.43 లక్షల(రూ.1.38 కోట్లు) నుంచి $1.91 లక్షల(రూ.1.85 కోట్లు) వరకు వార్షిక వేతనాన్ని అందిస్తున్నాయి. జీతంతో పాటు పలు అదనపు సౌకర్యాలను కూడా కల్పిస్తున్నాయి.
చిత్తూరు నగరంలోని సాంబయ్య కండ్రిగ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యవేక్షణలో ఎమ్మెల్యే, నగర పాలక కమిషనర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర సిబ్బందితో కలిసి భవన యజమానుల సహకారంతో పనులు చేపట్టారు. నగర అభివృద్ధికి ప్రజల సహకారం కీలకమని అధికారులు తెలిపారు.
AKP: రహదారుల శుభ్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ పథం కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని సబ్బవరం ఎంపీడీవో పద్మజ, ఆర్.డబ్ల్యూ.ఎస్ కన్సల్టెంట్ లోవరాజు పిలుపునిచ్చారు. ఇవాళ బాట జంగాలపాలెంలో స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని నిర్వహించి రహదారులను శుభ్రం చేశారు. ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
NDL: శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు రాబోయే వర్షాకాలంలో విస్తృతంగా మొక్కలు నాటేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఏడవ ట్రస్ట్ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 11న ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
AP: సీఎం చంద్రబాబుకు విజన్ ఉంటే మాజీ సీఎం జగన్‌కు ఏమీ లేదని మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు. టెండర్ల ప్రకారమే అమరావతిలో అభివృద్ధి జరగుతుందని వెల్లడించారు. 69 వంతెనల వద్ద వేగంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. రానున్న 4 నెలలు వర్షాలు ఉంటాయనే.. ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. రాజధాని రైతుల వద్ద ఇంతవరకు బలవంతంగా భూములు తీసుకోలేదని స్పష్టం చేశారు.
NLG: చండూరు మండలం చొప్పరవారిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై చొప్పరి చందు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. చందు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలను తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KMR: బిక్కనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం కంటి పరీక్షలు నిర్వహించారు. మండల కంటి వైద్యాధికారి రవీందర్ పటేల్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు చేపట్టారు. అవసరమైన వారికి కంటి అద్దాలు వాడుకోవాలని సూచించారు. కంటి వ్యాధుల పట్ల ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని ఆయన తెలిపారు. అవసరమైతే ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు.
WNP: ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులకు హైదరాబాద్ వారి ఉత్తర్వులను అనుసరించి ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఈనెల 8న విద్యార్హత ధ్రువపత్రాలు తీసుకొని అప్రెంటిస్ షిప్ సైట్ http://apprenticeshipindia.gov.in నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9849244030 సంప్రదించాలన్నారు.
NTR: తిరువూరులో యూరియా అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన చెక్ పొస్టులను ఆర్డీవో కుమార్ పరిశీలించారు. ఏపీ, తెలంగాణ బోర్డర్‌లో యూరియా అక్రమ రవాణాను నియంత్రించేందుకు సంబంధిత సిబ్బందికి కట్టుదిట్టమైన నిఘా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్డీవో వెంట పోలీస్ రెవిన్యూ వ్యవసాయ అధికారులు ఉన్నారు.
TG: కాంగ్రెస్ సర్కారుపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్ర విమర్శలు చేశారు. ‘అభివృద్ధి చేయలేదని అడిగితే.. ఎంత కండలు తిరిగిన పెహల్వాన్ అయినా 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా అని సీఎం అంటున్నారు. సరే మరి 30 నెలలైనా పిల్లలు పుట్టకపోతే ఏమనాలి? మిమ్మల్ని ఏమని పిలవాలి? నపుంసకులు అనాలా?’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో పెట్టి ఇస్తే సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు.
నెట్‌ఫ్లిక్స్ యాక్షన్ బ్లాక్‌బస్టర్ ‘వార్ మెషిన్’ సీక్వెల్ అధికారికంగా ఖరారైంది. అలన్ రిచసన్ హీరోగా, పాట్రిక్ హ్యూస్ దర్శకత్వంలో వచ్చిన ఈ మిలట్రీ యాక్షన్ థ్రిల్లర్ OTTలో భారీ విజయం సాధించింది. ఈ మూవీ తమ ఆల్ టైం టాప్ 10 సినిమాల్లో ఒకటిగా నిలిచిందని, ప్రస్తుతం పార్ట్ 2 డెవలప్మెంట్ స్టేజ్‌లో ఉందని మేకర్స్ ప్రకటించారు. ఈ క్రేజీ మూవీ తెలుగులోనూ అందుబాటులో ఉంది.
విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు జూ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దివ్య తెలిపారు. ‘వాతావరణ చర్య’ అనే అంశంతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జూలో ఈ కార్యక్రమం జరగనుందన్నారు. 1వ తరగతి నుంచి పీజీ విద్యార్థుల వరకు 3 విభాగాలుగా పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు.