MDK: నిరుద్యోగ యువతకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ‘పీఎం ఇంటర్న్షిప్’ పథకం ప్రవేశపెట్టినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో పోస్టర్లను ఆవిష్కరించారు. 18-25 ఏళ్ల లోపు వారు అర్హులని, ఎంపికైన వారికి నెలకు రూ.5వేల వేతనంతో పాటు రూ.6వేల అదనపు సాయం అందుతుందన్నారు. ఆసక్తి గల వారు వెంటనే అధికారిక పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.