ADB: ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈ నెల 10న ఆదిలాబాద్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ప్రతిభ కనబర్చి ఉద్యోగాలకు ఎంపిక కావడం ఆనందకరమని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. కళాశాల నుండి సుమారు 15 మంది విద్యార్థులు పాల్గొన్నారని, వారిలో ముగ్గురు విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు.