NGKL: జిల్లా కేంద్రంలోని మంతటి ఎక్స్ రోడ్ దగ్గర గల కన్వెన్షన్ హల్లో జరిగిన బీజేపీ సన్నాహక సమావేశంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రధాని మోడీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభకు జిల్లా నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.