MLG: ములుగు కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ సి.హెచ్. మహేందర్ జి ఆన్లైన్ ద్వారా జనగణన స్వీయ నమోదు చేసుకున్నారు. ఈ నెల 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు https://se.census.gov.inద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. మే 11 నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని వెల్లడించారు.