NZB: జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన వ్యక్తి భార్యను వేధించి హత్యాయత్నం చేసిన కేసులో కోర్టు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10,000 జరిమానా విధించింది. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయగా విచారణ అనంతరం నిజామాబాద్ మహిళల కోర్టు నిందితుడిని దోషిగా తేల్చిందని జక్రాన్ పల్లి ఎస్సై మహేశ్ పేర్కొన్నారు.